నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ….. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన వేగం పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే విధానంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు, ఖమ్మంతో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 104









