ఆ గ్రామంలో ఏ ఒక్కరికైనా ఆపద అంటే ఆగడు సాయం చేయటంలో ముందు:BRS పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసిద్దీన్
నేటి గదర్ న్యూస్, వైరా/ కారేపల్లి:
సింగరేణి గ్రామపంచాయతీ లో ప్రజా సేవకులు,నిరుపేద కుటుంబంలో పుట్టి నిరుపేదల కష్టాలు తెలిసిన ఆపద్బాంధవుడు బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ సింగరేణి గ్రామం పంచాయతీలో మజీద్ బజార్ కి చెందిన షేక్ జమీల్ కుమార్తె వివాహం ,జరుగుతున్న సమయంలో నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ జమీల్ , షేక్ పర్వీన్ కూతురుకి కి వివాహం జరిగింది.ఆర్థిక సాయం గా బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌస్ ద్దీన్ పెళ్లి కి కావలసిన వస్తువులు,ఆర్థిక సాయం అంద చేశారు. డబల్ కాట్ మంచం, డ్రెస్సింగ్ టేబుల్, దివాన్ కాట్ కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, కుక్కర్ సుమారు 23,000 రూపాయలు వరకు ఉన్న నగదు ,సామాను అందజేశారు. ఈ సందర్భంగా జమిలే కుటుంబీకులు మాట్లాడుతూ గౌసుద్దీన్ లాంటి వ్యక్తి ఊరికి ఒక్కడుంటే చాలు అని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ వారికి దేవుడు ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్,ఎండి కలియుల్లా ఖాన్తె,తెలుగల్ల రామారావు, జడల కళ్యాణ్, షేక్ యాసిన్, మోసిన్ షేక్ అబ్దుల్ వాహె, తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు, ముస్లిం మహిళలు షేక్ హత్, షేక్ జైన్ బి,షేక్ సోను, తదితరులు పాల్గొన్నారు.









