నేను సైతం ప్రజా సేవలో….
కాంగ్రెస్ నాయకులు పాకాలపాటి శేషగిరి
గత రెండు వారాలుగా.. నిరంతర శ్రమదానంలో పాల్గొన్న పాకాలపాటి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
* జోరుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
* 42వ డివిజన్లో పాకాలపాటి పర్యవేక్షణలో
ఖమ్మం : ఖమ్మం ఖిల్లా ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, రాష్ట్ర యువజన నాయకుడు తుమ్మల యుగంధర్ పర్యవేక్షణలో ఖమ్మం ఖిల్లా పై పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. క్లీన్ ఖమ్మం- క్లీన్ ఖిల్లా నినాదాన్ని నిజం చేస్తూ, తుమ్మల యుగంధర్ పిలుపుమేరకు 42వ డివిజన్ కార్పొరేటర్ పాకాలపాటి విజయనిర్మల శేషగిరి పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వీటిలో చురుకుగా పాల్గొంటున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాకాలపాటి శేషగిరి తనతోపాటు కాంగ్రెస్ జిల్లా నాయకులు, షాదిఖానా చైర్మన్ ఖదీర్, డైరెక్టర్ సమద్, కాంగ్రెస్ పార్టీ వన్ టౌన్ ఇన్చార్జి ఖాదర్ బాబా, అప్సర్, సలీం తదితరులు స్వయంగా పాల్గొని శ్రమదానం చేస్తున్నారు. ఖిల్లా పై ఉన్న చెత్తాచెదారం, ముళ్ళపొదలు, పిచ్చి మొక్కలు, ప్రహరీ చుట్టూ ఉన్న జనావాసాలపై వేలాడుతున్న చెట్లు, వాటి కొమ్మలను తొలగిస్తున్నారు. మరో వారం రోజుల్లో పారిశుద్ధ్య డ్రైవ్ పూర్తయ్యే అవకాశం ఉంది.









