ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్లు విడుదల చేయాలి
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలి
సిసిఐ పత్తి కొనుగోలు నిబంధనలు ఎత్తివేయాలి
వరి, పత్తికి తేమ శాతం 20 శాతానికి పెంచాలి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఖమ్మం జిల్లాలో రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ పెండింగ్ డబ్బులు 63 కోట్లు విడుదల చేయాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం బొంతు సమత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి కొనుగోలు నిబంధనలు రైతులకు నష్టం చేస్తాయని, సిసిఐ విధించిన కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్, తేమశాతం 8 నుంచి 12 శాతం ఉండాలి, ఎకరాకు ఏడు క్వింటాళ్ల కొనుగోలు నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని కోరారు. వరి, పత్తికి తెమ శాతం 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు ఎడతెరిపిలేని అధిక వర్షాలు మూలంగా దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు పరిహారం చెల్లించాలని, క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని సర్వే చేసి ఎకరాకు రైతులకు 30 వేలు, కౌలు రైతులకు 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, కమిటీ సభ్యులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, సంక్రాంతి నరసయ్య, అనుమోలు రామారావు, షేక్ నాగుల పాషా, తోట కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.









