వినాయకపురం రేషన్ దుకాణం వద్ద సన్న బియ్యం, 12 కిలోల సంచి పంపిణీ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 12: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, నేరుగా లబ్ధిదారులకు చేరువయ్యే కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా, వినాయకపురం కాలనీలోని రేషన్ దుకాణం వద్ద ఈ రోజు ఉదయం ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నాణ్యమైన సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు అందించారు. ముఖ్యంగా, ప్రజలు రేషన్ బియ్యాన్ని సులువుగా ఇంటికి తీసుకెళ్లడానికి వీలుగా, 12 కిలోల వరకు రేషన్ బియ్యం పట్టే నాణ్యమైన సంచిని కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ సౌకర్యంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జక్కుల జగదీష్ మరియు నారం జగదీష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలకు మరింత మేలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. లబ్ధిదారులు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా “జై కాంగ్రెస్, జై పొంగులేటి, జై జారే, జై జూపల్లి” అని నినాదాలు చేశారు.









