నాగార్జునకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ.!
అర్థరాత్రి వేళ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు..
సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మంత్రి కొండా సురేఖ..
నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో ఆమె ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ..
నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని అని పేర్కొన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని అన్నారు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.
తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం.









