+91 95819 05907

ప్రజా సంక్షేమంపై ఎమ్మెల్యే దృష్టి -భారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ప్రజా సంక్షేమంపై ఎమ్మెల్యే దృష్టి -భారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

గండుగులపల్లి, అశ్వారావుపేటలలో రూ. 16.46 లక్షల CMRF పంపిణీ – గురువారం నియోజకవర్గ పర్యటన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 12: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు, విద్యార్థులకు సహాయక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎమ్మెల్యే పర్యటన ఉదయం 9:00 గంటలకు గండుగులపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్‌లో ప్రారంభమవుతుంది. అక్కడ యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మెటీరియల్‌ను ఆయన పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలం లబ్ధిదారులకు రూ. 11,24,500/- విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. అదేవిధంగా, సాయంత్రం 4:00 గంటలకు అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట మండలం లబ్ధిదారులకు రూ. 5,21,500/- విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం రూ. 16,46,000/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాలకు మండల నాయకులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, అన్ని పంచాయతీల గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ వట్టి వెంకట్రావు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !