నాగులవంచలో గ్రామసభ.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద సాధారణ గ్రామసభ నిర్వహించారు .గ్రామ సభకు గ్రామ కార్యదర్శి బి చిరంజీవి అధ్యక్షత వహించారు. ఉపాధి హామీ పనులను నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. వీధిలైట్లు అవసరం ఉన్నచోట వేయాలని గ్రామస్తులు కార్యదర్శిని కోరారు. గ్రామ సభలో ఆదాయ, వ్యయ ఖర్చులను గ్రామ కార్యదర్శి గ్రామ సభలో చదివి వినిపించారు. కార్యక్రమంలో మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి వెంకటేశ్వరరావు ,మండల కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య ,కాంగ్రెస్ నాయకులు ఎల్లంపల్లి సతీష్, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది దేశబోయిన కొండలు,కంభం పద్మ,కందిమళ్ళ బుచ్చిబాబు, మంద రాజ్కుమార్,తురక వెంకటేశ్వర్లు,బాషాసాహెబ్, పడిశాల గోపి,భహాటం ఫణిరాజు,పడిశాలయశోద,ఓర్సు పుష్పపాల్గొన్నారు.









