+91 95819 05907

వేదాంతపురంలో వన దుర్గంబికా సమేత లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

వేదాంతపురంలో వన దుర్గంబికా సమేత లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

చైర్మన్‌గా గడ్డం వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా కూన చిన్నారావు; ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ హామీ.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వన దుర్గంబిక సమేత వన లింగేశ్వర స్వామి ఆలయ కమిటీని గ్రామ ప్రజల సమక్షంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు మరియు భక్తుల ఏకగ్రీవ ఆమోదంతో నూతన కమిటీ ఛైర్మన్‌గా గడ్డం వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా కూన చిన్నారావు, కోశాధికారిగా దాది సోమరాజు బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా దాది వెంకటేశ్వరరావు, సంగీత సత్యనారాయణ, ఉప్పాడ హరి బ్రహ్మానందం, కూనదుర్గారావు, నడదీ లక్ష్మయ్య, గడ్డం రాముడు, పసుపులేటి నాగమణి, యలవర్తి శిరీష, దాది లక్ష్మి, కొయ్యల కమల, పైడిమంగ, దాది రాజేశ్వరి, గడ్డం వీరలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గడ్డం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేదాంతపురం గ్రామంలో పురాతన కాలం నుంచి ఉన్న శ్రీ వన దుర్గంబికా సమేత వన లింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడతానని హామీ ఇచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు తోట వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సోమని శివ శంకర ప్రసాద్, పైడి లవర్ రాజుతో పాటు గ్రామ ప్రజలు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !