+91 95819 05907

మద్దికొండ గ్రామంలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

మద్దికొండ గ్రామంలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

గిరిజన యోధుడు బిర్సా ముండా సేవలను కొనియాడిన అధికారులు, ప్రజా ప్రతినిధులు.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 15: భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషించిన గొప్ప గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను అశ్వారావుపేట మండలంలోని మద్దికొండ గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయంతి సందర్భంగా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సమ్మయ్య మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, అడవుల రక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై పోరాడిన బిర్సా ముండా జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, యువత దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కూడా బిర్సా ముండా సేవలను స్మరించుకుని, ఆయన అందించిన సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వ

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !