+91 95819 05907

అశ్వారావుపేట అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే జారే

అశ్వారావుపేట అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే జారే

భద్రాచలంలో జిల్లా రివ్యూ సమావేశం; నియోజకవర్గ సమస్యలు వివరించిన జారే ఆదినారాయణ.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి సంబంధించి సమన్వయ పరిశీలన కమిటీ సమావేశం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురామ్ రెడ్డి, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు. గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాలలో జరుగుతున్న పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ ప్రతి పథకం గ్రామస్థాయికి చేరేలా సమన్వయ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత మరియు వేగం పెంచాలని అధికారులకు సూచించారు. విభిన్న శాఖల మధ్య సమన్వయం ద్వారా మాత్రమే అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అన్ని శాఖల అధికారుల సహకారం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !