+91 95819 05907

బిర్సా ముండా స్పూర్తితో యువత ముందుకు సాగాలి.

బిర్సా ముండా స్పూర్తితో యువత ముందుకు సాగాలి.
*ఘనంగా బిర్సా ముండా 150వ,జయంతి వేడుక*
నేటి గదర్‌ కరకగూడెం: యువత బిర్సా ముండ స్ఫూర్తితో ముందుకు సాగాలని కరకగూడెం మండల ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసి)అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ అన్నారు. ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసి) ఆధ్వర్యంలో అమరుడు భగవాన్ బిర్సా ముండ 150 జయంతి వేడుకలను బట్టిపల్లి గ్రామంలోని కొమరం భీమ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పొలెబోయిన క్రిష్ణయ్య మాట్లాడుతూ చిన్ననాటి నుండి చదువుతోపాటు ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ అంచలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఆయనపై బ్రిటిష్ వాళ్లు జమీందారీ విధానాన్ని వ్యతిరేకంగా ఉల్గాన్ అనే పేరుతో అతని నినాదం అయినా రాణి రాజ్యం అంతమై మన రాజ్యం స్థాపించబడాలని బ్రిటిష్ వారు తిరగబడ్డారని ఆయన అన్నారు.ఆయన చేసిన ఎన్నో పోరాటాలకు గుర్తుగా రాంచీలో ఒక రైల్వే స్టేషన్ కు బిర్సా ముండ పేరు నామకరణం చేశారని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకున్ని దేశంలో గుర్తించి ఆయన చిత్రపటాన్ని దేశ పార్లమెంట్‌లో ఉంచడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, కొమరం రాంగోపాల్,తుడుందెబ్బ అధ్యక్షులు పొలెబోయిన ప్రేమ్ కుమార్,కలం సంపత్,చందా రామక్రిష్ణ,పాయం.నరసింహరావు, ఊకే నరేష్,కలం వేణుగోపాల్,ఇర్ప.నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !