తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించినా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ తో పాటు గచ్చిబౌలి స్టేడియం, HICC వంటి వేదికలను అధికారులతో కలిసి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో సాధించిన విజయాలు మరియు
2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాం అని అన్నారు
దుబాయ్ ఫెస్టివల్‌ను మించే స్థాయిలో
ప్రపంచ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు చేరే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.
హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూల నగరం అని ప్రపంచానికి తెలియజేస్తాం అని డిప్యూటీ సీఎం అన్నారు
ఈ భారీ ఈవెంట్ కోసం 100 ఎకరాల ఓపెన్ స్పేస్ అవసరం అవుతోంది కాబట్టి
భారత్ ఫ్యూచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
డిసెంబర్ 8, 9 రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన రోజులు కానున్నాయి అని డిప్యూటీ సీఎం అన్నారు.









