నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.
తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మంజిల్లా ప్రతినిధి,
సతీష్కుమార్జినుగు.
నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.
అదనపు కలెక్టర్, కామేపల్లి, సింగరేణి మండలాల తహసిల్దార్ కార్యాలయాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో తిరస్కరించిన దరఖాస్తులు, దానికి గల కారణాలను తెలియజేస్తూ నివేదిక అందించాలని తహసిల్దార్ లను ఆదేశించారు. ర్యాండెంగా తిరస్కరించిన దరఖాస్తులను క్రాస్ చెక్ చేయడం జరుగుతుందని, అనవసరంగా రెవెన్యూ సదస్సు దరఖాస్తులు తిరస్కరించినట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. పెండింగ్ ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంతో పాటు ఆమోదించిన దరఖాస్తుల వివరాలను పూర్తిస్థాయిలో భూ భారతి పోర్టల్ లో 100 శాతం అప్ డేట్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాదా బైనమా దరఖాస్తులను ఎటువంటి తప్పిదాలు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. సాదా బైనమా దరఖాస్తులలో ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.అదనపు కలెక్టర్ తనిఖీల సందర్భంగా తహశీల్దార్లు సుధాకర్, రమేష్ , నాయబ్ తహసీల్దార్ షఫీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









