నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మార్చి 2024 తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల పెన్షనర్లు రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సోమవారం హైదరాబాద్
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి మండల పెన్సిలర్ సంఘం నాయకులు హైదరాబాద్ వెళ్ళినారు. తమకు న్యాయంగా రావలసినటువంటి రిటైర్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు .గత 20 నెలలుగా రిటైర్మెంట్ అయినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, అనేకమంది ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ సంఘం బాధ్యులు అంబటి శాంతయ్య, కంచుమర్తి పుల్లయ్య ,మండల సంఘంబాధ్యులుమధుసూదన్,రెడ్డి,రాంచందర్రావు ,మాధవరావు, ఆదినారాయణ, రెహముద్దీన్,మస్తాన్,వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.









