+91 95819 05907

అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం: పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం – సీపీఐ నిరసన దీక్ష

అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం: పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం – సీపీఐ నిరసన దీక్ష

భూస్వాములకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా? అశ్వరావుపేట తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆందోళన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం తాహాసిల్దార్ కార్యాలయం ముందు ఆదివారం అర్ధరాత్రి ఇళ్లు కూల్చేసిన నిరుపేదలకు న్యాయం చేయాలంటూ సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. గత 5, 6 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 200 కుటుంబాల ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన దీక్షను కొనసాగిస్తామని సయ్యద్ సలీం స్పష్టం చేశారు. అదేవిధంగా కెమిలాయిడ్స్, గోకరాజు రంగరాజు వంటి భూస్వాములకు అప్పగించిన వందల ఎకరాల ప్రభుత్వ భూముల సంగతి ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క పేదల గుడిసెల తొలగింపుకే అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న బడాబాబులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా నాయకులు బుడితి చిరంజీవి, తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి సంఘీభావం తెలియజేశారు. ఈ పోరాటంలో సీపీఐతో కలిసి తాము కూడా ప్రయాణం చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని వారు ప్రకటించారు. ఈ నిరసన దీక్షలో సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, దౌర్జన్యంగా ఇళ్లు కోల్పోయిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !