+91 95819 05907

గుడిసెలు కోల్పోయిన పేదలకు పునరావాసం కల్పించాలి: తుడుం దెబ్బ డిమాండ్‌

గుడిసెలు కోల్పోయిన పేదలకు పునరావాసం కల్పించాలి: తుడుం దెబ్బ డిమాండ్‌

అశ్వరావుపేటలో గుడిసెలు కోల్పోయిన బాధితులను పరామర్శించిన తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేటలో ఇటీవల ప్రభుత్వ అధికారులు తొలగించిన గుడిసెలు కోల్పోయిన బాధితులను తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి మంగళవారం పరామర్శించారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఇళ్లు లేని నిరుపేదలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించి, బాధితుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, నిరుపేదల పొట్టగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అధికారులను ప్రశ్నించారు. ఎంతో ఇష్టపడి కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపిస్తే నేడు పేదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు పలు పత్రికల్లో ప్రచురించినా రెవెన్యూ అధికారులకు స్పందన లేదు కానీ పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి, ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని తుడుం దెబ్బ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తంబళ్ల రవితో పాటు కారం రత్నా కుమారి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !