నిరుపేదలకే డబల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలి : సిపిఎం
డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన సిపిఎం బృందం
అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను ప్రభుత్వమే పూర్తి చేయాలి -సిపిఎం పార్టీ డిమాండ్
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎనిమిది గ్రామాల్లో నిర్మాణం పనులు పూర్తికాక వివిధ దశలోనే ఆగిపోయి ఉన్నాయని అట్టి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వమే నిర్మాణ పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం బృందం అసంపూర్తిగా మిగిలి ఉన్న బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ చేసి పేదలకు ఇవ్వాలని, భూమిలేని నిరుపేదలుకు, ఇల్లు లేని వారికి, వితంతు వికలాంగులకు ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అష్ణగుర్తి గ్రామంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం 45 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం జరిపిందని అవి నిర్మాణం పూర్తికాక వివిధ దశల్లో నిలిచిపోయాయని అన్నారు. అట్టి ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లను ఈరోజు గ్రామ సభలో ఎమ్మార్వో చదివి వినిపించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా జరగలేదని ఇల్లు ఉన్నవారికి ఇల్లు మంజూరు ఇచ్చారని, ఎంపికలో నిరుపేదలు, వితంతువులుకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వలేదని సభకు హాజరైన వితంతు మహిళలు ప్రజలు తాసిల్దార్ మరియు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ మంజూరైన జాబితాలో ఇల్లు ఉన్నవారు ఆర్థికంగా ఉన్నవారిని తప్పించి నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు మంజూరు ఇవ్వాలని తాసిల్దార్ మరియు ప్రభుత్వ అధికారులను వారు కోరారు. గ్రామంలో అర్హులైన నిరుపేదలు ఉన్నారని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇవ్వాలని వారు కోరారు.ఇల్లు మంజూరు అయిన వారు నిరుపేదలు కనుక మిగిలిన ఇండ్ల నిర్మాణ పనులను తమ సొంత డబ్బుతో నిర్మాణం జరిపే స్థితిలో వారు లేరని అన్నారు. ప్రభుత్వమే వెంటనే నిర్మాణం పూర్తిగా జరిపి పేదలకు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ముందుగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. కొన్ని గృహాలు కు కిటికీలు, దర్వాజాలు, కొన్నింటికి ఫ్లోరింగ్ చేయలేదు కొన్నిళ్లకు ప్లాస్టింగ్ చేయలేదు, మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదు. నిలిచిపోయిన నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. పూర్తికాక నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అదేగాక రోడ్ల సదుపాయం సీసీ రోడ్డు నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం ,త్రాగునీటి వ్యవస్థ కరెంటు సరఫరా మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, గ్రామ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు చిత్తా రు నాగరాజు, మండల కమిటీ సభ్యులు చిత్తూరు లక్ష్మణ్ కిలారి శ్రీనివాసరావు బాజోజు రమణ, సొసైటీ మాజీ అధ్యక్షులు కోనెదెన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









