+91 95819 05907

గూడూరుపాడు అభివృద్ధికి ₹8.50 కోట్లు మంజూరు.

గూడూరుపాడు అభివృద్ధికి ₹8.50 కోట్లు మంజూరు.

– బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రంతో గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

– అర్హులందరికీ మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం రూరల్ : గూడూరుపాడు గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో ₹8 కోట్లు 50 లక్షలు విడుదల చేసిందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ గూడూరుపాడు–ఆకేరు మార్గానికి ₹1.10 కోట్లు, ఎం.వి.పాలెం–గూడూరుపాడు రహదారి నుండి చెరువు అలుగు వరకు ₹3.30 కోట్లు, గూడూరుపాడు–గొర్లపాడు రహదారికి ₹2.97 కోట్లు మంజూరు చేసి బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ₹35 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రం భవనానికి ₹21 లక్షలు, త్రాగునీటి సదుపాయాలకు ₹7 లక్షలు కేటాయించామని చెప్పారు.

“ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడూరుపాడు గ్రామ అభివృద్ధి ఏ కోణంలోనూ వెనుకబడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామాభివృద్ధి కోసం మొత్తం ₹8.50 కోట్లు విడుదలయ్యాయి. స్థానికుల డిమాండ్ మేరకు కోల్డ్ స్టోరేజ్ రహదారిని కూడా ఆమోదం తెలుపుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

“పేదలకు ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన గత పాలకులకు లేదు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. గూడూరుపాడులో ఇప్పటికే 17 ఇందిరమ్మ ఇండ్లు ఆమోదం పొందాయి. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లను తప్పక అందిస్తాం” అని అన్నారు.

“రైతు భరోసా కార్యక్రమం ద్వారా కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్న వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ అందిస్తున్నాం. రైతును రాజు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.

గురుకులాల్లో 40% డైట్ చార్జీలు, 200% కాస్మొటిక్స్ చార్జీల పెంపు చేపట్టామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల రేషన్ కార్డుల విడుదల జరిగిందని గుర్తుచేశారు.

“పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమం–అభివృద్ధి అనే రెండు రెక్కలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా” అని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నరసింహారావు, ఆర్‌అండ్‌బి ఎస్ఈ యాకోబు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !