*మావోయిస్టులను ఫేక్ ఎన్‌కౌంటర్స్ చేయడం విచారకరం.*
*కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట.*
——- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు మాడేరుమిల్లులో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్, అందకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్‌కౌంటర్స్ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్ కౌంటర్స్‌తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేయడం విచారణకరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.









