*గుండాల సీఐ ఎల్ రవీందర్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,! మారకద్రవ్యాల అలవాటుతో యువతకు పెను ప్రమాదం పొంచి ఉందని గుండాల సీఐ ఎల్ రవీందర్ అన్నారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో విద్యార్థులతో కలిసి నాష ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మారకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు అయినప్పటికీ ఇంకా వాటి మూలాలు అక్కడక్కడ ఉంటున్నాయని అన్నారు. పూర్తిగా వీటిని ఆపాలంటే యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నడుంబిగించి వాటికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటు పడితే వాటిని మానడం అంత సులువు కాదని అందుచేత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మిన తీసుకు వెళ్తున్నట్టు తెలిసిన పోలీస్ వారికి తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు









