+91 95819 05907

దమ్మపేట మండల బీఆర్‌ఎస్ పోరుబాట: దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై డిమాండ్

దమ్మపేట మండల బీఆర్‌ఎస్ పోరుబాట: దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో నిరసన

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దమ్మపేట మండల బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ఉధృతంగా ఆందోళన చేపట్టాయి. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మండలంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి నినాదాలు చేసి, అనంతరం ఎంపీడీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ మాట్లాడుతూ దమ్మపేట మండలంలో గుంతలు పడ్డ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరై, 70% పూర్తయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల ప్రజల సమస్యలను పరిష్కరించకుంటే, భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మండల ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన వెంకటేశ్వరావు, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాసరావు, మహేష్, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, బీసీ సంఘం నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు, మండల నాయకులు సోడెం గంగరాజు, కుకలకుంట రవి, అబ్దుల్ జిన్న, కోర్స వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, తోలేం మల్లేశ్వరావు, వల్లెపు నాగేశ్వరావు, కేసిన మధు, వాడపల్లి ఆనంద్రావు, మిడత లక్ష్మీనారాయణ, గణేష్, నూతి అజయ్, మడిపల్లి పోలయ్య తదితర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !