+91 95819 05907

వేదాంతపురంలో కొత్త వెలుగులు -గ్రామమంతా వీధిలైట్లతో పండుగ వాతావరణం

వేదాంతపురంలో కొత్త వెలుగులు -గ్రామమంతా వీధిలైట్లతో పండుగ వాతావరణం

​గ్రామాభివృద్ధికి పంచాయతీ ముందడుగు -కార్యదర్శి మస్తానా షేక్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) నవంబర్, 21: అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమైన అడుగు వేసింది. గ్రామంలోని ప్రధాన వీధులు, సెంటర్ ప్రాంతాలు, కాలనీల్లో రాత్రివేళల్లో వెలుతురును అందించేలా వీధిలైట్ల ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తి చేసినట్టు పంచాయతీ కార్యదర్శి మస్తానా షేక్ తెలిపారు. గ్రామ ప్రజల భద్రత, రాత్రి వేళల్లో రాకపోకలు సురక్షితంగా ఉండేలా వీధిలైట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ లైట్లతో ఇంతవరకు చీకటిగా, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలు కూడా పూర్తిగా వెలుగుతో కళకళలాడుతున్నాయి. దీనివల్ల రాత్రి సమయాల్లో ప్రమాదాలు తగ్గే అవకాశముందని, గ్రామంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడతాయని పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల సూచనలు తీసుకుంటూ, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని కార్యదర్శి తెలిపారు. పంచాయతీ తీసుకున్న ఈ చొరవపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, పంచాయతీ శ్రద్ధను అభినందించారు. గ్రామం సమగ్ర పురోగతి సాధించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని కార్యదర్శి మస్తానా షేక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !