+91 95819 05907

భీకర ప్రమాదం -జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా ఏసీ… ఇద్దరికి తీవ్ర గాయాలు

భీకర ప్రమాదం -జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా ఏసీ… ఇద్దరికి తీవ్ర గాయాలు

దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఘటన. ఏసీ వాహనం నుజ్జునుజ్జు, కరెంట్ స్తంభం ధ్వంసం. డ్రైవర్ల నిర్లక్ష్యంపై ప్రాథమిక అంచనా.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్ట్రర్:దాది చంటి) నవంబర్, 21: దమ్మపేట మండలం ముష్టిబండ ప్రాంతంలో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఇక్కడ జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం పూర్తిగా ధ్వంసమైంది, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అశ్వరావుపేట నుండి సత్తుపల్లికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముష్టిబండ అంతర్గత రహదారి నుండి ప్రధాన జాతీయ రహదారిపైకి వస్తుండగా, వడ్లగూడెం వైపు నుండి అతి వేగంగా వచ్చిన టాటా ఏసీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ గుద్దుడు తీవ్రతకు టాటా ఏసీ ఎగిరిపడి, పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, బస్సు కొంతమేర దెబ్బతింది. కరెంట్ స్తంభం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఖాళీగా ఉండటం అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన ప్రాంతం జాతీయ రహదారి కావడంతో, రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాటా ఏసీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !