+91 95819 05907

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

బ్రేకింగ్ న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో

వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం

● హైదరాబాద్, నవంబర్ 22: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకుండా అమలు చేయాలని స్పష్టం చేస్తూ శనివారం ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది.
● జీవోలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే విధానాన్ని స్పష్టంగా వివరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొంది.
● మహిళలకు 50% రిజర్వేషన్
మహిళలకు అన్ని కేటగిరీల్లో — ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ — 50 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
● 2019 రిజర్వేషన్ రొటేషన్‌కు ప్రాధాన్యం
గత పంచాయతీ ఎన్నికల్లో (2019) ఏ కేటగిరీలకు రిజర్వేషన్లు కేటాయించారో, ఆ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని జీవోలో పేర్కొంది.
● సర్పంచ్ – వార్డ్ మెంబర్ల రిజర్వేషన్ ఆధారాలు
వార్డు సభ్యులు: 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు
సర్పంచ్‌లు:
●సాధారణ రిజర్వేషన్ కోసం 2011 జనగణన ఆధారంగా
బీసీ సర్పంచ్ పోస్టులకు 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ అమలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ జీవో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !