కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలిగా దేవి ప్రసన్న నియామకం: ఎమ్మెల్యే జారే శుభాకాంక్షలు
పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తోట దేవి ప్రసన్న కృషి చేస్తారని జారె ఆదినారాయణ విశ్వాసం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) నవంబర్, 22: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న ఎన్నికైన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరేలా ఆమె చేసిన కృషికి ఇంత చక్కని అవకాశం దక్కిందన్నారు. దేవి ప్రసన్న అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ మరింత చురుకుగా పని చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. అలాగే నూతన అధ్యక్షులు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.









