పలు శుభకార్యాల్లో పాల్గొన్న అశ్వరావుపేట బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం
నాగుపల్లిలో వివాహ వేడుకకు హాజరు; ముకమామిడి శివారులో చిన్నారి ఉయ్యాల వేడుకలో ఆశీస్సులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, నవంబర్, 22: అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పలు శుభకార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను, చిన్నారులను ఆశీర్వదించారు. శనివారం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో కనపర్తి ప్రభాకరరావు-అలివేలు దంపతుల కుమారుడు రిషి, ప్రతిమల వివాహ శుభకార్యానికి సోయం వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామ శివారులోని ఎర్రప్పగుంపు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ దుబ్బా నరసింహారావు-రమాదేవి దంపతుల కుమార్తె ఉయ్యాల వేడుక కార్యక్రమాలలో పాల్గొని, ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ శుభకార్యాలలో ఆయన వెంట తాటి రమణ తదితరులు పాల్గొన్నారు. సోయం వీరభద్రం నియోజకవర్గంలో ప్రజల శుభకార్యాలకు హాజరై వారికి అండగా నిలవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.









