+91 95819 05907

అందరి వాడు సహజ కవి అందెశ్రీ.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

 అందరివాడు మన సహజ కవి అందే శ్రీ స్పూర్తి తో ప్రజలలో మమేక మై తెలంగాణ అస్తిత్వం, గౌరవాన్ని నిలుపుతూ మనం ముందుకు కదలాలని ప్రముఖ న్యూరో సర్జన్ , డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పీ ఎస్ ) , వీర నారీమణుల ఆశయ సాధన సమితి, తెలంగాణ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ బద్రూ నాయక్ అధ్యక్షతన బీ కే బజార్ లో జరిగిన ప్రజా కవి, సహజ కవి అందెశ్రీ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంచి మనసు, మంచి మానవ సంబంధాలు సమాజంలో మనకు మంచి పేరును తీసుకొస్తా యన్నారు. మన కవి అందెశ్రీ అలాంటి వాడేనని, అందుకే ఆయన అందరి వాడు అయ్యారని తెలిపారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పీ ఎస్ )రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ బద్రూ నాయక్ మాటాడుతూ పేదరికం లో పుట్టి , పేదరికం లోనే పెరిగి, ఆ పేదరికం లోనే చివరి శ్వాస తీసుకుంటూ …. ప్రతిక్షణం తెలంగాణ గానం , తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం చేసిన ప్రజా కవి, సహజ కవి అందెశ్రీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన గేయం సకల జనులకు ఏకం చేసిందని తెలిపారు. పామరుడు అయినా పండితుడు వలె గేయ రచనలతో పాటు తానే సొంతంగా గానం చేసిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే కాకుండా సకల జనులకు ఆదర్శనీయుడని పేర్కొన్నారు. తొలుత అందెశ్రీ చిత్రపటం తో పాటు గద్దర్, బెల్లీ లలిత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే, ఫాతిమా షేక్ , సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు కూడా పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , అడ్వకేట్ ఎస్.కె . నజీమా, వివిధ సంఘాల నాయకులు పగిడిపల్లి నాగేశ్వరరావు , నకరికంటి సంజీవరావు , హనుమంతరావు , రిటైర్డ్ సీఐ నాగయ్య , రవీంద్ర నాయక్ , మురళి నాయక్ , వీరన్న మహిళ నాయకురాలు భూక్య జ్యోతి , ప్రమీల, ఝాన్సీ, కవిత, పి. లక్ష్మి, సుధా, మరియా, కోమలి, సుజాత, సునీత, నాగమణి, రాధిక తదితరులు పాల్గొనగా పమ్మి రవి , పాగె వెంకన్న , కొమ్ము రమా , జాంబవ గర్జన లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !