+91 95819 05907

జగన్నాధపురం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కక ఆదేశాల మేరకు

నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :

చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో 18 ఏండ్లు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ &మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. స్వర్గీయ మాజీ ప్రధానీ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు చీరల పంపిణీ ప్రారంభించినట్టు తెలిపారు.ప్రజా ప్రభుత్వం రాకతో మహిళల అభివృద్ధికి 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు.
RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, బస్ లకు యజమానులు ను చెయడం మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇవ్వడం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అని, ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే కుటుంబాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.
కుల గణన సర్వే సందర్భంగా ఆధార్ నంబర్ల ఆధారంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేస్తునట్లు తెలిపారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో. మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, చింతకాని మండల మహిళా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షురాలు తోటకూరి ప్రగతి,కాంగ్రెస్ నాయకులు తోటకూరి హరీష్, మండేపూడి కిషన్ రావు, తాళ్లూరి రమేష్, మధిర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టెల కృష్ణ, బీసీ సెల్ నాయకులు వజ్రాల వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు అరువురి వెంకటేశ్వర్లు,గ్రామ దీపిక కాశీమల గీత, గ్రామ పెద్దలు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !