సామినేని రామారావు హత్య చేసిన హంతకులను శిక్షించాలని ఈనెల 25న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయండి.
నేటి గదర్ న్యూస్, వైరా:
సిపిఎం నేత సామినేని రామారావు ను హత్య చేసిన నేరస్తులను అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ వద్ద జరుగు మహాధర్నా కు సిపిఎం శ్రేణులు కదిలి రావాలని. సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. గతనెల 31న సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావును అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసిన నేరస్తులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నేరస్తులను అరెస్ట్ చేయలేదని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరుగు నిరసన, మహాధర్నా కు వైరా నియోజకవర్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఒక ప్రకటన కోరారు.
Post Views: 77









