తెలంగాణ రాష్ట్ర మహిళలకు వడ్డీ లేని రుణాలు.
డిప్యూటీ సీఎం బట్టి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కూమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25న 3.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మొత్తం 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఒకేసారి పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమగ్రంగా, శ్రద్ధగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరుగనున్న రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల సమాఖ్య, గ్రామ సమాఖ్యల ముఖ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.
గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా పునరుద్ధరించి, రాష్ట్రంలోని మహిళల్లో నమ్మకం, ధైర్యాన్ని పెంపొందించగలిగిందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.
ఇప్పటికే రెండు–మూడు దఫాల్లో రుణాల పంపిణీ జరగగా, ఈ నెల 25న మరోసారి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









