పోలీస్ వాహనంపై మృతదేహం ఎక్కించి నిరసన..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో సంచలన ఘటన వెలుగు చూసింది.
ఓ యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి ఆందోళనకు దోంచందా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు.
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో బంధువులు యువకుడి మృతదేహంతో శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు.
తాళ్లరాంపూర్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.









