+91 95819 05907

సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు గుత్తా రాధాకృష్ణ మృతి

సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు గుత్తా
రాధాకృష్ణ మృతి

నివాళులు అర్పించిన పోతినేని సుదర్శన్ రావు

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా పట్టణానికి చెందిన సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ గుత్తా రాధాకృష్ణ (72) అనారోగ్యంతో మృతి చెందారు. రాధాకృష్ణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినారు. ఆర్టీసీ కార్మిక యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేసి ఉద్యోగులు, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. సిఐటియూ వైరా పట్టణ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలపై దృష్టి సారించారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నా వైరా స్టడీ సర్కిల్ కు రెగ్యులర్ గా హాజరవుతూ నిరంతరం అధ్యయనం చేసేవారు. ఆరోగ్యం సహాకరించకపోయినా గుత్తా రాధాకృష్ణ పార్టీ పట్ల పూర్తి బాధ్యతతో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా కృషి చేశారు. నవంబర్ 25వ తేదీ మంగళవారం మృతి చెందిన గుత్తా రాధాకృష్ణకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా కుమారుడి రాక కోసం భౌతికకాయాన్ని ఖమ్మం మమత హాస్పిటల్ లో భద్రపరిచారు. శుక్రవారం అమెరికా నుంచి రాధాకృష్ణ కుమారుడు రావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు అమరజీవి కామ్రేడ్ గుత్తా రాధాకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. విరితోపాటు నవతెలంగాణ మెఫిసీయల్ ఇంచార్జీ గుత్తా వేణు మాధవ్, సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, వైరా డివిజన్ కమిటీ సభ్యులు మచ్చా మణి, తోట నాగేశ్వరరావు, మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణిదెన కోటేశ్వరరావు, పారుపల్లి కృష్ణారావు, మల్లెంపాటి రామారావు, షేక్ జమాల్ సాహేబ్, మల్లెంపాటి ప్రసాదరావు, మచ్చా కృష్ణమూర్తి, పైడిపల్లి సాంబశివరావు బొంతు సమత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, కంసాని మల్లికాంబ, కురుగుంట్ల శ్రీనివాసరావు, దేవబత్తిని నరసింహారావు, నారికొండ అమరేందర్, అమరనేని కృష్ణ, బండారు రామారావు, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి రామారావు, అట్లూరి శ్రీనివాసరావు, సంక్రాంతి భాస్కరరావు, బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !