+91 95819 05907

సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే…..

సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే…..

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : ఖానాపురం హవేలీ లిక్కి కృష్ణారావు అధ్యక్షతన పూలే అంబేడ్కర్ అధ్యయన వేదికలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు బహుజన మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాధు మాలాద్రి హాజరై మొట్ట మొదటిసారిగా భారతదేశంలోనే చదువు అందరికీ కావాలని ఉద్యమించినవాడు తనే స్వయంగా ఉచిత పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్యకు కూడా చదువును నేర్పి బాలలకు మహిళలకు ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువును అందించిన వాడు ఫూలే అని అన్నారు . సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి నిజాన్ని నిబ్బరంగా చెప్పినవాడు బ్రాహ్మణీయ వాదము నుండి సూద్రా కులాలు విముక్తి కావాలని పోరాడినవాడు పూలే . అంతటి మహనీయుడు చూపించిన మార్గం ద్వారా నేడు తెలంగాణ ప్రాంతంలో బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని అన్నారు. మరో వక్త సుంకర శీను మాట్లాడుతూ పూలే ఆశయాన్ని కొనసాగించడం అంటే నేడు బీసీలు రిజర్వేషన్ సాధించుకోవడంతోపాటు బహుజన రాజ్యాధికారం సాధించడమే ఆశయంగా ఉండాలని అన్నారు . బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బహుజన కుల సంఘాలను ఏర్పాటు చేసి రాజ్యంపై తిరుగుబాటుడంకా మోగించిన కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో కుల సంఘాల నిర్మాణం జరిగి మా శక్తిగా ఎదగాలని సూచించారు . బిఎప్టీయూ రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణీయ వాదాన్ని ఆధిపత్య కులాలను వారు ఏర్పాటు చేసుకున్నా రాజకీయ పార్టీలను తక్షణమే బీసీలు వాటి నుండి బయటపడాలని సూచించారు . పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొడకండి రాంబాబు మాట్లాడుతూ నవంబర్ 30న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సును జయప్రదం చేయాల్సిన బాధ్యత దళిత బహుజన జాతులపై ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో సామాజిక నాయకులు మేకల సుగుణ , బహుజన టీచర్స్ యూనియన్ లీడర్ నాగమణి , సంపత్ , లింగనబోయిన లక్ష్మణ్ , పి ఆర్ దేవి , పెరుగు రమణ , ముత్యాలరావు , నరేష్ , దార వెంకయ్య , బసవయ్య , తదిరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !