+91 95819 05907

ఉద్యోగ , ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.

ఉద్యోగ , ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.

ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు , పెన్షనర్స్ బకాయుల విడుదలకు కృషి చేస్తా : పిఆర్టియు టిఎస్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షను విరమింప చేసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు , పెన్షనర్స్ బకాయిలు , పెండింగ్ డిఎ లును విడుదల చేయాలని పిఆర్సి ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిఆర్టియు టిఎస్ ఖమ్మం జిల్లాశాఖ
చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగియడం తో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి దీక్షలో కూర్చున్న ఉపాధ్యాయులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేసారు . జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన దీక్ష ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న ప్పటికీ ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం శోచనీయమని , ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు . ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు , పెన్షనర్స్ బకాయిలు , పెండింగ్ డిఎ
లు విడుదల , పిఆర్సి ఏర్పాటు , సిపిఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులను కలిసి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసామని , నెలకు 700 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా నిధులు విడుదల చేయక పోవడం తో
ఉద్యోగులు , ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురయ్యారని దాని పర్యవ స్థానమే ఖమ్మం జిల్లాశాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షని పేర్కొన్నారు . దీక్ష విరమణ కార్యక్రమం లో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి , పిఆర్పిఏ రాష్ట్ర అధ్యక్ష , ప్రధానకార్యదర్సులు మోతుకూరి మధు , కే వెంకట నర్సయ్య , ఖమ్మం జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రంగారావు , అసోసియేట్ అధ్యక్షులు విజయ్ అమృత కుమార్ , బ్రహ్మా రెడ్డి , రాష్ట్ర బాద్యులు వెంకటేశ్వరరావు , రెబ్బా శ్రీనివాసరావు , మదార్ హుస్సేన్ , జిల్లా బాద్యులు రత్న కుమార్ , రవికుమార్ , వినోద్ కుమార్ , కిరణ్ కుమార్ , చాంద్ బేగం
మహబాద్ , కొత్తగూడెం , సూర్యాపేట జిల్లాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్సులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !