నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ)నవంబర్ 30.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామం వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వెల్దుర్తి మెదక్ ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రామాయపల్లి, బండ పోచంపల్లి, ఎద్దులపల్లి గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. చిన్న రోడ్డు, గుంతల మయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Post Views: 113









