+91 95819 05907

సర్పంచ్ ఎన్నికలు..అభ్యర్థులకు ఈసీ గుర్తులు ఎలా ఇస్తారో తెలుసా..?

*సర్పంచ్ ఎన్నికలు..అభ్యర్థులకు ఈసీ గుర్తులు ఎలా ఇస్తారో తెలుసా..?*

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి ఎన్నికలకు 30, వార్డు సభ్యుల ఎన్నికలకు 20 గుర్తులు కేటాయించారు. గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. పార్టీ రహితంగా నిర్వహించబడే ఈ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కీలక ఘట్టాన్ని పూర్తి చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన వెంటనే.. పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

*తెలుగు అక్షర క్రమం ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు*
పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు నామపత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు, ‘అబ్బయ్య’ అనే పేరుతో నామినేషన్ వేసిన వారికి.. ‘జానకి’ అనే పేరుతో నామినేషన్ వేసిన వారి కంటే ముందుగా గుర్తు కేటాయిస్తారు. కొందరు అభ్యర్థులు తమ ఇంటిపేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొంటారు. పేరుకు ముందు భాగంలో ఉన్న అక్షరం ఆధారంగానే ఈ క్రమాన్ని నిర్ణయిస్తారు. ఇది అభ్యర్థులు తమ బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే ఒక వ్యూహం కూడా. సర్పంచి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం 30 ప్రత్యేక గుర్తులను కేటాయించింది. అదనంగా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే తమ నిరసనను తెలియజేసేందుకు ‘నోటా’ గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రాధాన్యత క్రమంలో *ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్టు, స్పానర్ (పానా), చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బిస్కెట్, వేణువు, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్* వంటి నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించారు. సర్పంచి అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు.

వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 20 గుర్తులను కేటాయించింది. నోటాతో కలిపి మొత్తం 21 గుర్తులు ఉంటాయి.
*గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ ఆంటినా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ కర్ర బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్, నోటా* వంటి సాధారణ గుర్తులను కేటాయించారు. వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన గుర్తులను తెల్ల రంగు (వైట్) బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. గుర్తుల కేటాయింపు పూర్తైన వెంటనే.. ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన చర్యలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. తొలి విడత ఎన్నికలకు ఈనెల 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !