TG: హిందువుల్లో మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని.. ఒక్కో దేవుడిపై ఒక్కొక్కరికి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. మంగళవారం గాంధీభవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. *’పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారికి మరో దేవుడు ఉన్నాడు. మందు తాగేవాళ్లకు, పప్పన్నం, మాంసం తినేవాళ్లకూ దేవుళ్లు ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.* కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగినవారు ఉంటారని ఆయన తెలిపారు. *దేవుడిపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఎలా..?ఉంటుందని సీఎం అన్నారు.*
Post Views: 17









