✴️ బిల్లులు అడిగినందుకు సర్పంచులను జైలుపాలు చేసిన కాంగ్రెస్ సర్కార్, గ్రామాలను చీకటిమయం చేసింది
✴️ గ్రామాల్లో పెండింగ్ బిల్లులు ఏవి?
✴️ కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసింది
✴️ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలి
✴️ మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు 👇
🔸అవ్వ తాతలకు నెలకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి, అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపారు
🔸రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. యాసంగి రైతుబంధు పడలేదు, రూ. 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను గోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం
🔸ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు
🔸రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది.. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా?
🔸కొత్తవి దేవుడెరుగు, ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి పేదల పెళ్లిళ్లకు సాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు
🔸గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఆపివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు
🔸బిల్లులు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచులను జైలుపాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం
🔸సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేక అధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగం చేశారు
🔸గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు లీవులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది
🔸కనీసం స్ట్రీట్ లైట్స్ నిర్వహణ లేక గ్రామాలు చీకటిమయం అయిపోయాయి
🔸పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు
🔸పారిశుధ్య లోపం వల్లే గజ్వేల్ ప్రాంతంలో చాలామంది డెంగ్యూ వంటి విషజ్వరాలతో చనిపోయారు
🔸ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
🔸ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన గజ్వేల్ ను.. దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్‌గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారే
🔸ఆ అభివృద్ధిని కాపాడుకోవాలన్నా, భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్ళీ కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది
🔸కాంగ్రెస్ నాయకులు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారు
🔸420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి, చిత్తుచిత్తుగా ఓడించాలి
🔸వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, అందరి కష్టాలు తీరుతాయి









