జమ్మిగూడెం సర్పంచ్ రేసులో బీఆర్‌ఎస్ -ముద్దిన వెంకట నర్సమ్మ నామినేషన్
బీఆర్‌ఎస్ శ్రేణులతో భారీ ప్రదర్శనగా వచ్చి నామినేషన్ దాఖలు
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్ 02: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో శ్రీమతి ముద్దిన వెంకట నర్సమ్మ మంగళవారం నామినేషన్ వేశారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్న, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీ రామూర్తి, నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, మరియు సీనియర్ నాయకులు కాసాని చంద్రమోహన్, మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. జమ్మిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, శ్రీమతి ముద్దిన వెంకట నర్సమ్మ వెంట భారీ ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఆమె సర్పంచ్ పదవికి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ముద్దిన రాములు, మిద్దిన కొండయ్య, గ్రామ పెద్దలు, మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









