+91 95819 05907

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయంను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయంను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు.

కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకిటి శ్రీహరి, ఎంపి రామా సహాయం రఘు రామిరెడ్డి, పోరిక బలరాం తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొట్టమొదటగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందన్న విషయాలను గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్షను ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నెరవేర్చిన నేపథ్యంలో యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినట్టు వివరించారు.

దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపించిన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం విద్య, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ప్రాంతంలో ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు పరిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ (DrMMSESUT) ను ఇక్కడ నెలకొల్పామని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో విద్య, నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !