+91 95819 05907

ఆరోగ్యానికి ఐదు సూత్రాలు. డాక్టర్ కే వి కృష్ణారావు.

ఆరోగ్యానికి ఐదు సూత్రాలు.
డాక్టర్ కే వి కృష్ణారావు.

పిల్లల ఆరోగ్యం పై నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ కె వి కృష్ణారావు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : టేకులపల్లి గురుకులంలో న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. సంస్థ అధ్యక్షులు గరిడేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన పిల్లల ఆరోగ్యం పై అవగాహన సదస్సు జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కె వి కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే 5 సుత్రాలు పాటించాలిఅన్నారు. ఈ 5 సుత్రాలు సమతుల్య ఆహారం , ప్రశాంతమైన నిద్ర , శారీరక శ్రమ , పరిశుభ్రత , వినోదం అని అయన పేర్కొన్నారు. సమతుల్య ఆహారం అంటే విటమిన్లు , మినరల్స్ , పీచు పదార్థాలు , పిండి పదార్థాలు , మాంసం కృతులు , కొవ్వు పదార్థాలు సమపాళ్ళలో ఉండాలన్నారు. పిల్లల ఎదుగుదలకు మూడు రకాల ఎలిమెంట్స్ అవసరం అని ఆయన తెలిపారు. ఐరన్ , క్యాల్షియం , జింకు . యాపిల్ గాని బెల్లం గాని ఖర్జూర పండ్లు , పాలకూర , మటన్ , బీట్రూట్ , మునగాకు , కిస్ మిస్ లు లాంటివి తీసుకుంటే ఐరన్ వస్తుంది అయన అన్నారు. నువ్వులు , తమలపాకులు , రాగిజావ లాంటివి తీసుకుంటే క్యాల్షియం లభిస్తుంది అయన పేర్కొన్నారు. బూడిద గుమ్మడికాయ గింజలు , సన్ఫ్లవర్ గింజలు , పల్లీలు తినడం వల్ల జింకు వస్తది ఆయన తెలిపారు. ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయని అయన అన్నారు . కావున పిల్లలకు రాగి జావను మజ్జిగలో గానీ బెల్లం వేసి తాపించాలి అని అయన తెలిపారు . నువ్వులు బెల్లం ఉండలు కలిపి తింటే ఐరన్ ఐరన్ మరియు క్యాల్షియం వస్తాయన్నారు. ప్రశాంతమైన నిద్ర
అంటే పిల్లలు 6 నుంచి ఎనిమిది గంటలు విధిగా నిద్ర పోవాలి అని అయన తెలిపారు. దీనివలన బాడీ అంతా రిపేర్ అయి రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండటానికి దోహదపడుతుంది వివరించారు. శారీరక శ్రమ అంటే పిల్లలు ఉదయం పూట ప్రతిరోజు ఎండలో ఒక గంట సమయాన్ని కేటాయించి వాకింగ్ , రన్నింగ్ , సైక్లింగ్ , యోగ లాంటి వ్యాయామలు చేయాలన్నారు. దీనివలన శరీరం రిలీఫ్ అయ్యి హ్యాపీ హార్మోన్స్ విడుదల అయి మానసికమైన ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు . విటమిన్ డి వలన రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండటానికి దోహద పడుతుంది చెప్పారు. పరిశుభ్రత లో వ్యక్తిగత పరిశుభ్రత , పరిసరాల పరిశుభ్రత లు ఉంటాయన్నారు . వ్యక్తిగత పరిశుభ్రత అంటే శరీరానికి శుభ్రంగా ఉంచుకోవడం , గోర్లు కత్తిరించుకోవడం . ఎప్పటికప్పుడు చేతులను హ్యాండ్ వాష్ తో శుభ్రంగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అని వివరించారు. పరిసరాల పరిశుభ్రత లో ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలు , వేస్ట్ నీరు నిలవ లేకుండా చేయడం వల్ల దోమలు ఉండవు . దాని వలన మలేరియా , బోదకాలు , డెంగు లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి తెలియజేశారు. వినోదం అంటే పిల్లలను సంతోషం పరిచే సినిమాలు , టీవీలలో కార్యక్రమాలు గాని , కామెడీ దృశ్యాలు పిల్లలు చూడటం వల్ల ఆహ్లాదము సంతోషం కలిగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అని ఆయన అన్నారు. దీంట్లో భాగంగా పిల్లలను అప్పుడప్పుడు పార్కు మరియు టూర్లకు తీసుకుని పోవడం వలన వాళ్ల మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది . అలాగే డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి ఆయన హెచ్చరించారు. హాస్టల్లో ఉన్న పిల్లలకు ఎక్కువ శాతం ఎలర్జీ వస్తది కావున గజ్జి తామర రాకుండా ఉండాలంటే తడి దుస్తులు ధరించకూడదు . కావున పొడి దుస్తులు ధరించాలి అని తెలిపారు. ఒకవేళ వ్యాధులు వస్తే వెంటనే చర్మవ్యాధుల డాక్టర్ ను సంప్రదించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం సునీత , వైస్ ప్రిన్సిపాల్ ఏ రీనాధారిదేవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ డి స్వప్న లత , & కే శైలజ , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి మరియు టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !