*__అతిక్రమిస్తే చర్యలు తప్పవు___*
*__ఎ సి పి సాంబరాజు__*
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎన్నికల ప్రవర్తననియమావళి అనుగుణంగా వ్యవహరించాలని చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల స్పెషల్ ఇంచార్జి ఎ సి పి సాంబరాజు,చింతకాని ఎస్.ఐ వీరేందర్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్పంచ్ అభ్యర్థులకు,వార్డు మెంబెర్ గా
పోటిచేస్తున్న అభ్యర్థులకు రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని,ర్యాలీలు నిర్వహించాలన్న,ప్రచారానికి మైక్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని,ఓటర్లను బెదిరించినా
మద్యం,డబ్బులు,కులాలు,మతాల పేరుతో ప్రలోభాలకు గురిచేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు..









