మల్లెమడుగు విద్యార్థినిలకు గోల్డ్ మెడల్
నేటి గదర్ న్యూస్ ఖమ్మం టౌన్: ఇటీవల సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో జరిగిన సిఎం కప్ క్రీడల్లో ఫుట్బాల్ బాలికల విభాగం నుండి ఖమ్మం రూరల్ మండలానికి చెందిన జెడ్పీ
ఉన్నత పాఠశాల ( మల్లెమడుగు ) విద్యార్థినిలు గోల్డ్ మెడల్ సాధించారు . ఖో-ఖో బాలికల విభాగం నుండి సిల్వర్ మెడల్ సాధించారు . ఈ మేరకు ఆ పాట శాల
ప్రధానోపాధ్యాయులు కె.సాంబమూర్తి, పిడి బియ్యని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థినిలను ప్రధాన ఉపాధ్యాయులు ,ఉపాధ్యాయులు ,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు అలివేణి ,59 , 60 డివిజన్ కార్పొరేటర్స్ లలితా రాణి , నిరంజన్ కుమార్ ,గ్రామ పెద్దలు కృష్ణమూర్తి, బోజర్ల సూర్యం, కృష్ణ, జానీ మియా, వెంకయ్య, వైకుంఠ చారి, తాటికొండ శ్రీనివాస్, తిరుపతిరావు, సైదులు, బట్టబోతుల సతీస్ తదితరులు అభినందించారు









