+91 95819 05907

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ఫిబ్రవరి 4: జిల్లాలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో అత్యాధునిక వైద్య వసతులతో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల హెల్త్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో బుధవారం తనిఖీలు చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ, పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా, సమర్థవంతంగా వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నూతన హెల్త్ కమ్యూనిటీ సెంటర్ అందుబాటులోకి వస్తే, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. మాతృశిశు సంరక్షణ, అత్యవసర వైద్యం, సాధారణ చికిత్సలు, ల్యాబ్ సేవలు తదితర అన్ని సదుపాయాలు ఈ కేంద్రంలో కల్పించనున్నట్లు తెలిపారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే, పనుల పురోగతిపై తరచూ నివేదికలు సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్ గౌడ్, వైద్య శాఖ ఇ ఇ ఉమామహేశ్వర రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు ఆలోచించని త్యాగాధని మాత రమాబాయి

మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు ఆలోచించని త్యాగాధని మాత రమాబాయి నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తును ఆలోచించని త్యాగ ధని మాత రమాబాయి

Read More »

అశ్వారావుపేటలో ‘కారు-సైకిల్’ జోరు: ఉమ్మడి ప్రచారంతో హోరెత్తిన వీధులు

అశ్వారావుపేటలో ‘కారు-సైకిల్’ జోరు: ఉమ్మడి ప్రచారంతో హోరెత్తిన వీధులు ​అభివృద్ధి మంత్రం.. భారీ ర్యాలీలతో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్-టిడిపి దూకుడు నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 07: మున్సిపల్

Read More »

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

 Don't Miss this News !