ఆదరించండి అందుబాటులో ఉంటాను
స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను
9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గుడిమెట్ల రజిత
నేటి గదర్ న్యూస్, వైరా:
మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.అందుబాటులో ఉంటాను. వార్డు సమస్యలే నా సమస్యగా పనిచేస్తానని, వార్డులోని స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వైరా మున్సిపాలిటీ 9వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన
సిపిఐ(ఎం) అభ్యర్థిని గుడిమెట్ల రజిత అన్నారు. గురువారం సిపిఐ(ఎం), బీఆర్ఎస్ శ్రేణులు వైరా మేయిన్ రోడ్డు, ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిత్యం అందరికీ అందుబాటులో ఉంటానని, వార్డు అభివృద్ధికి నిజాయితీగా పని చేస్తానని అన్నారు. ప్రతి ఓటరును ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు పోతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, సిపిఐ(ఎం) జిల్లా, స్థానిక నాయకులు, వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.









