నేటి గదర్ న్యూస్, ఖమ్మం : లంబాడీలా ఆరాధ్యడు , సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు గాను ఒక పాఠ్యాంశం గా చేర్చాలని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు. వీరనారీ మణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో బుధవారం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బానోత్ బద్రు నాయక్ అధ్యక్షతన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు, అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ లంబాడీల ఐక్యతకు వారి సంస్కృతి , సాంప్రదాయ రక్షణకు సేవాలాల్ జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. బంజారాస్ పేరుతో దేశంలో దేశ దిమ్మరులుగా వలసలు పోతూ , జీవించే లంబాడీలకు ఒక దిశ నిర్దేశాన్ని కల్పించిన మహనీయుడు, సామాజిక విప్లవకారుడు సేవాలాల్ అని పేర్కొన్నారు. తండాల లో నేడు స్థిర నివాసం ఏర్పరచూ జీవిస్తున్న లంబాడీలు ప్రస్తుతంసామాజికంగా , రాజకీయంగా ఎదుగుతున్నారంటే సేవాలాల్ , లంబాడి జాతికి చేసిన సేవలే కారణమన్నారు. లంబాడీల అభివృద్ధికి అభ్యున్నతికి ఆయన అనేక నైతిక అంశాలలో చూపిన మార్గం సదా అనుసర అనుసరణీయమన్నారు. అటువంటి మహానీయుడి జయంతి , వర్ధంతిలా కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సూచించారు.
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ తమ సంఘం లంబాడీల హక్కుల సాధన తో పాటు వారి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ , సంత్ సేవాలాల్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం అంటూ సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , జిల్లా కార్యదర్శి స్పందన , న్యాయ సలహాదారులు షేక్. నజీమా , సహాయ కార్యదర్శి షరీఫా బేగం , ఆఫీస్ ఇంచార్జి బానోతు కృష్ణవేణి , జిల్లా ఉపాధ్యక్షురాలు బి. జ్యోతి , సలహాదారులు కే .లక్ష్మి , శృతి ,న్యాయవాది వి. లక్ష్మీనారాయణ , బహుజన జేఏసీ , సావిత్రిబాయి పూలే కమిటీల నాయకులు దాసరి శ్రీనివాస్ , నకరికంటి సంజీవరావు , బి. వెంకటేశ్వర్లు , సురభి నాయక్ , వీరన్న నాయక్, ,శ్రీనివాస చారి , ప్రకాష్ ,రవీందర్ ,నాగేశ్వరావు, రమేష్ ,జాన్ భీ ,త్రివేణి , వెంకటనారాయణ , సరోజని , ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
తదితరులు పాల్గొన్నారు









