“నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి.. మనశ్శాంతి ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి. పెద్ద కలలు కనడం ఏమాత్రం తప్పు కాదని ప్రతిరోజూ చెబుతూ, నా సామర్థ్యం మీద నాకున్న నమ్మకం కంటే ఎక్కువే నేను సాధించగలనని ప్రోత్సహించిన వ్యక్తి. ఎవరూ చూడట్లేదన్నంత స్వేచ్ఛగా డ్యాన్స్ చేయనిస్తూ, ఎప్పుడూ నన్ను ఆపని వ్యక్తి.. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయడం ఎంత గొప్ప విషయమో చూపించిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే, ఇతని గురించి నేను ఒక పుస్తకమే రాయగలను. నేను ఏ విధంగా ఉండాలని కలలు కన్నానో, ఈరోజు అలా మారానంటే దానికి కారణం నువ్వే. విజ్జూ.. నీపై నాకున్న భావాలను వర్ణించడానికి నాకు ఎప్పుడూ మాటలు సరిపోవు!! ఈరోజు నా విజయాలు, పోరాటాలు, బాధలు, సంతోషం, జీవితం – వీటన్నింటికీ ఒక అర్థం దొరికిందంటే అది నీ వల్లే.” అంటూ పెళ్లి తర్వాత రష్మిక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
Post Views: 16









