నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం హర్షణీయం అని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ లు అన్నారు. శుక్రవారం వారు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ గిరిజన ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు.ఫిబ్రవరి 15న సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.అదే విధంగా బంజార హిల్స్ లో సేవాలాల్ మహారాజ్ వచ్చే జయంతి నాటికి సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన జరుగుతుందని అన్నారు. గోర్ బోలిను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని వారు తెలిపారు. త్వరలోనే తండా, గూడెం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సేవాలాల్ మహారాజ్ రూపాన్ని నాణెం పై ముద్రించడానికి సిఫారసు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని ప్రభుత్వ పక్షాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన జాతి పక్షాన వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.