నేటి గదర్, మే 28, భద్రాద్రి కొత్తగూడెం :
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో అశ్వరావుపేట MVI సహా మరో కానిస్టేబుల్ చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం. అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ లో లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అనిశా అధికారులు ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా చెక్పోస్ట్ వద్ద ఆర్టీవో సిబ్బంది 22 చక్రాల వాహనానికి రూ.800, 16 చక్రాల వాహనానికి రూ.400, 12 చక్రాల వాహనానికి రూ.200 చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్న ఏసీబీ అధికారులకు వెళ్లడైనట్లు సమాచారం. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్న అనిశా అధికారులు, రికార్డులలో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని తెలిపిన ఏసీబీ అధికారులు. ఉండవలసిన నగదు కంటే సుమారు పదివేల రూపాయలు పైబడి నగదు అధికంగా ఉన్నట్లు వినికిడి.? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 277